తెలంగాణ

telangana

Sankranti Effect on Highway Road

ETV Bharat / videos

సొంతూరి బాట పట్టిన నగరవాసులు - హైదరాబాద్​ టు విజయవాడ రూట్​లో ఫుల్​ రష్ - Traffic in Highway Road

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 9:16 PM IST

Sankranti Effect on Highway Road :సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్​ టు విజయవాడ మార్గంలో భారీ రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పండుగ సందర్భంగా నగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై కార్లు, బస్సులు, ఆటో, ద్విచక్ర వాహనాలతో రద్దీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు జాతీయ రహదారి గుండా సంక్రాంతి పండుగకు వెళ్తున్నారు.

Huge Rush in Toll Plaza : దీంతో వందలాది వాహనాలతో జాతీయ రహదారి సందడిగా మారింది. ఈ క్రమంలో పంతంగి టోల్​ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా 16 గేట్లకు గానూ 10 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపిస్తున్నారు. సాధారణ రోజుల్లో 35 నుంచి 40 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, సంక్రాంతి పండుగ నేపథ్యంలో 20 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగిస్తున్నట్లు టోల్​ప్లాజా నిర్వాహకులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఫాస్టాగ్​ విధానంతో ట్రాఫిక్​కు అంతరాయం కలగకుండా వాహనాలు ముందుకు సాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details