శిల్పారామంలో సంక్రాంతి సంబరం భాగ్యనగరంలో కోలాహలం - Bhogi celebrations in Shilparam
Sankranti celebrations in Shilparam సంక్రాంతి సంబరాలు హైదరాబాద్ శిల్పారామంలో ఘనంగా జరుగుతున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలతో సందడి నెలకొంది. సంక్రాంతికి గ్రామాలకు వెళ్లలేని వాళ్ళ కోసం.. శిల్పారామంలో పండుగ జరుపుకునేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. హరిదాసు, గంగ దేవర, బుడు బుక్కుల ,పిట్టల దొర వేషధారులు భవిష్యత్తు తరాలకు.. సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తూ సందడి చేస్తున్నారు. ఇక్కడ తమ ఊరును చూసుకుంటూ.. నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.