Sanjay Raut On CM KCR : 'ఓటమి భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చారు' - సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్
Sanjay Raut On CM KCR Maharashtra Tour : మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏమాత్రం ఉండబోదని శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఇలానే చేస్తే.. తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయమని అన్నారు. కేవలం ఓటమి భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వస్తున్నారని చెప్పారు.
12 నుంచి 13 మంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు మాత్రమేనని.. బీఆర్ఎస్, బీజేపీకి బీ టీమ్ అని పేర్కొన్నారు. బీజేపీనే ఆయన్ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ బలంగా ఉందని సంజయ్ రౌత్ స్ప,్టం చేశారు.
'12 నుంచి 13 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఇది కాంగ్రెస్, కేసీఆర్ మధ్య పోరు మాత్రమే. మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారని నేనంటున్నాను. మీరు బీజేపీ బీ టీమ్. ఈ పరిణామాలన్నీ తెలంగాణలో మీ ఓటమికి కారణాలవుతాయి. మహారాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం పడదు'. - సంజయ్ రౌత్, ఎంపీ