తెలంగాణ

telangana

Sanjay Kumar comments on MLA Ticket

ETV Bharat / videos

Sanjay Kumar Comments on MLA Ticket : 'టికెట్ వస్తుందో రాదో.. పోటీ చేస్తానో లేదో'.. కాకరేపుతున్న ఎమ్మెల్యే సంజయ్​ కామెంట్స్ - BRS latest politics

By

Published : Aug 20, 2023, 4:23 PM IST

Sanjay Kumar Comments on BRS MLA Ticket Issue :ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్​లో టికెట్ల ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా టికెట్ వస్తుందో రాదో, పోటీ చేస్తానో లేదో తెలియదంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యానించటం కలకలం రేపింది. రెండు రోజులుగా సంజయ్ కుమార్​కు తొలి జాబితాలో ఉండదని టికెట్ రకరకాల ప్రచారం సాగుతోంది. జగిత్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల గురించి చెబుతూనే తనకు అవకాశం వస్తే ఆశీర్వదించాలని ఓటర్లను కోరటం ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల అదిష్ఠానాన్ని ఇంకా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సంజయ్ తెలిపారు. దీంతో క్యాడర్ అంతా సందిగ్ధంలో పడిపోయింది. మరోవైపు సోమవారమే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్టు విడుదల చేస్తామని ఊహాగానాలు రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details