తెలంగాణ

telangana

sania mirza

ETV Bharat / videos

ఎల్బీ స్టేడియంలో సానియా ఫేర్​వెల్​ మ్యాచ్​.. ఎవరెవరు వచ్చారంటే? - సానియా మీర్జావారత్లు

By

Published : Mar 5, 2023, 2:44 PM IST

Updated : Mar 5, 2023, 2:50 PM IST

ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా తన ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఆడుతోంది. డబుల్స్‌ మ్యాచ్‌ సానియా, బోపన్న- ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరుగుతోంది. సింగిల్స్‌లో రోహన్‌ బోపన్నతో సానియా తలపడనుంది. సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, అజారుద్దీన్‌, హీరోలు దుల్కర్​సల్మాన్ తదితరులు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అజారుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ సానియా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందని చెప్పారు. క్రీడా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరముందని ఆయన ఆభిప్రాయపడ్డారు. మహిళా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. మ్యాచ్‌ అనంతరం సాయంత్రం ఓ ప్రైవేట్‌ హోటల్‌లో రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌, గాలా డిన్నర్‌ జరగనుంది. సాయంత్రం గాలా డిన్నర్‌కు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు, సినీ, క్రీడా ప్రముఖులు మహేశ్‌బాబు, ఏఆర్‌ రెహమాన్‌, సురేష్‌రైనా, జహీర్‌ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు హాజరుకానున్నారు. 

Last Updated : Mar 5, 2023, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details