తెలంగాణ

telangana

ETV Bharat / videos

Samagra Shiksha Abhiyan Teachers Protest at Hyderabad : పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన సమగ్ర శిక్షా ఉద్యోగులు.. రెగ్యులరైజ్ చేయాలంటూ డిమాండ్ - Dharna of Sarva Shiksha Abhiyan employees

🎬 Watch Now: Feature Video

Samagra Shiksha Abhiyan Teachers Protest at Hyderabad

By

Published : Aug 16, 2023, 1:49 PM IST

Updated : Aug 17, 2023, 11:29 AM IST

Samagra Shiksha Abhiyan Teachers Protest at Hyderabad : సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ... లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. సుప్రీకోర్టు తీర్పు ప్రకారం సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని... మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తూ... హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగిన ఉద్యోగులను.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉద్యోగులకు మద్దతుగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య, పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ ను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. పోలీసులను ఉద్యోగులు అడ్డుకోవడంతో... కాసేపు గందరగోళం ఏర్పడింది. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంతో... పోలీసులకు, ఉద్యోగులకు తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగి పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీలం వెంకటేష్ ఖండించారు. తమ ఆవేదనను కమిషనర్ దేవసేనకు తెలిపేందుకు.. రాష్ట్ర నలుమూలల నుంచి  పెద్దఎత్తున ఉద్యోగులు కార్యాలయానికి వచ్చారని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన పోలీసులతో అన్యాయంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు.

Last Updated : Aug 17, 2023, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details