Sajjanar Launched TSRTC Gamyam App : బస్సుల ట్రాకింగ్ కోసం టీఎస్ఆర్టీసీ ‘గమ్యం’ యాప్..
Sajjanar Launched TSRTC Gamyam App : ప్రజలకు రవాణా మరింత సౌకర్యంగా అనుకూలంగా మార్చేందుకు టీఎస్ ఆర్టీసీ అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్‌తో ముందుకు వచ్చింది. ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఎండీ వీసీ. సజ్జనార్ ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి బస్ ట్రాకింగ్ 'గమ్యం' అనే యాప్‌ను ఆవిష్కరించారు. ఆర్టీసీకి చెందిన 4వేల 170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పుష్పక్ ఎయిర్‌పోర్ట్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు సజ్జనార్ వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఈ యాప్‌లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా మహిళల భద్రత కోసం పలు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డయల్ 100, 108కి సైతం ఈ యాప్‌ను అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఇకపై బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో అని వేచిచూడాల్సిన అవసరం లేదని, అత్యాధునిక ఫీచర్లు గల ‘గమ్యం’ యాప్ తో ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.