Sachin Statue In Wankhede : లాఫ్డెడ్ షాట్ ఆడుతున్నట్లు సచిన్ విగ్రహం.. వీడియో చూశారా? - sachin wankhede relation
Published : Oct 22, 2023, 9:39 PM IST
Sachin Statue In Wankhede :మహారాష్ట్ర..ముంబయి వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేయనున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ విగ్రహం అహ్మద్‌నగర్‌లో రూపొందుతోంది. ఈ విగ్రహాన్ని శిల్పి ప్రమోద్ కాంబ్లే.. సుందరంగా తయారు చేస్తున్నారు. బ్యాట్ పట్టుకొని లాఫ్టెడ్ షాట్ ఆడుతున్న పోజులో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. కాగా, నిర్మాణ పనులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెందూల్కర్ ఈ ఏడాది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ విగ్రహాన్ని నవంబర్ 1న వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్సీఏ (ముంబయి క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షులు ఇటీవలే ప్రకటించారు.
వాంఖడేతో సచిన్ అనుబంధం..సచిన్ సొంత రాష్ట్రం మహారాష్ట్ర కావడం వల్ల ముంబయి వాంఖడేతో అనుబంధం ఏర్పడింది. సచిన్ చిరకాల స్వప్నం వన్డే ప్రపంచకప్ కల నెరవేరింది కూడా ఈ మైదానంలోనే. 2011 వరల్డ్‌కప్ శ్రీలంకతో.. భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది ఇక్కడే. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది కూడా వాంఖడేలోనే. ఇక ఇప్పటికే ఈ స్టేడియంలో ఆయన పేరిట 'సచిన్ రమేశ్ తెందూల్కర్' స్టాండ్ ఉంది.