తెలంగాణ

telangana

RTC MD VC Sajjanar Interview on Women Free Travel

ETV Bharat / videos

మహాలక్ష్మి పథకంతో తెలంగాణ ఆర్టీసీ పుంజుకుంటుంది : సజ్జనార్ - ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈటీవీ భారత్ ముఖాముఖి

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 10:51 AM IST

Updated : Dec 10, 2023, 11:00 AM IST

RTC MD Sajjanar Interview on Women Free Travel :ప్రజారవాణా వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రమంతటా బాలికలు, మహిళలు, వృద్ధులు ఉచిత ప్రయాణించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు.  

కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్టీసీ వ్యవస్థ ఈ పథకం ద్వారా పుంజుకుంటుందని సజ్జనార్ అన్నారు. ఇలాంటి పథకం వల్ల అందరూ బస్సులో ప్రయాణించడానికి ముందుకు వస్తారని దానివల్ల ప్రజా రవాణా శాతం కూడా పెరుగుతుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల స్వయం శక్తి మెరుగవుతుందన్న ఆయన ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడుతుందంటున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.  

Last Updated : Dec 10, 2023, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details