తెలంగాణ

telangana

RTC Bus Accident in Hyderabad

ETV Bharat / videos

RTC Bus Accident Hyderabad Live Video : సిగ్నల్ వద్ద ఆగిన ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. వీడియో వైరల్ - Hyderabad rtc bus accident Reason

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 11:06 AM IST

RTC Bus Accident Hyderabad Live Video : సిగ్నల్​ వద్ద ఆగి ఉన్న ఆటోను వెనకాల నుంచి వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని పాతబస్తీ బహదూర్పూరా క్రాస్​ రోడ్డు దగ్గర సిగ్నల్​ పడడంతో వావానాలు ఆగాయి. ఇంతలో వెనకాల నుంచి రాజేంద్రనగర్​ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టింది.  బస్సు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఆటో ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు వారికి ప్రాథమిక చికిత్స చేసి పోలీసులకు సమాచారం అందించారు.

RTC Bus Hits Auto At Traffic Signal Hyderabad : ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. వీడియోలో డ్రైవర్ కావాలనే ఆటోను ఢీకొట్టినట్లు కనిపించగా.. ఆ విషయంపై పోలీసులు ఆరా తీశారు. అయితే బస్సు బ్రేక్​ ఫెయిల్​ అయినందున ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్​ తెలిపాడు. ప్రమాదం జరిగిన విజువల్స్​ స్థానిక  సీసీ కెమెరాల్లో చిక్కాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details