Viral Video : మద్యం మత్తులో రౌడీ షీటర్ వీరంగం.. అడ్డుకున్న పోలీసులపై దాడి - తాగిన మత్తులో రౌడీషీటర్ హల్‌చల్
Rowdy Sheeter Halchal in Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మద్యం మత్తులో షేక్ అబ్బు అనే రౌడీ షీటర్ హల్‌చల్ సృష్టించాడు. పాత బస్టాండ్ వద్ద బజ్జీబండి యజమాని రవీందర్‌ను డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయగా... ఆయన నిరాకరించడంతో అతనిపై దాడికి తెగబడ్డాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులపై కూడా నిందితుడు దాడి చేశాడు. ఆగ్రహించిన స్థానికులు రౌడీషీటర్‌కు దేహశుద్ధిచేశారు. దాడిలో గాయపడిన కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
'బోధన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రవీందర్ అనే వ్యక్తి బజ్జీలబండి నిర్వహిస్తున్నాడు. అబ్బు అనే వ్యక్తి అక్కడకు వచ్చి రవీందర్‌ను రూ.500 ఇవ్వమని అడిగాడు. అతను ఇవ్వడానికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మా సిబ్బంది అక్కడకు వెళ్లి వారిని విడిపించే ప్రయత్నం చేశారు. అప్పుడు అబ్బు అనే వ్యక్తి కానిస్టేబుల్ బాలాజీపై దాడికి దిగాడు. స్థానికులు ఆగ్రహంతో అబ్బు అనే వ్యక్తిని కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.' అని సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు.