Robbery At Mahankali Temple Road : కంట్లో కారం కొట్టి... రూ.10లక్షల విలువైన ఆభరణాలు చోరీ.. - సికింద్రాబాద్ హాంకాంగ్ రోడ్దుపై దొంగతనం
Published : Aug 30, 2023, 10:46 AM IST
Robbery At Mahankali Temple Road Attack With Chilli Power : సికింద్రాబాద్... మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.9.56 లక్షల విలువైన ఆభరణాల దోపిడి జరిగింది. 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. మరో వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి కళ్లలో కారం కొట్టి అతని వద్ద ఉన్న విలువైన బ్యాగును అపహరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన మూలంగా ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Stealing By Hitting Pepper In The Eyes :మహంకాళి పోలీస్ స్టేషన్ సీఐ పరశురాం కథనం ప్రకారం.. బాధితుడు ఓం ప్రకాశ్ సికింద్రాబాద్ సీటీసీ ప్రాంతంలోని హాంకాంగ్ బజార్‌లోని బీవీఎస్ పార్లిస్ సర్వీసులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 28న సాయంత్రం నగరంలోని పలువురు వ్యాపారుల నుంచి యాంటిక్ ఆభరణాలు తీసుకుని బయలుదేరాడు. రాత్రి 11 గంటల సమయంలో హాంకాంగ్ బజార్ చేరుకోగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓం ప్రకాశ్‌ను అడ్డగించారు. కళ్లలో కారం చల్లి ఆభరణాల పార్శిల్ ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు.