తెలంగాణ

telangana

Roads damaged in Mulugu

ETV Bharat / videos

Roads Damage in Mulugu District : భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు.. నిలిచి పోయిన రాకపోకలు - roads damaged in Mulugu district

By

Published : Aug 2, 2023, 10:13 AM IST

Roads Damage in Mulugu District Heavy Rains 2023 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లాలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలకు వెళ్లే రహదారి వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయింది. తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో నార్లపూర్, కొత్తూరు, మేడారం వెళ్లే రహదారిపై 6 ఇంచుల మేర మట్టి పేరుకు పోయింది. గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో తాడ్వాయి ఏటూరునాగారం వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై వరద తాకిడికి తారు రోడ్డు తెగిపోయింది. 

గుండ్ల వాగు ప్రాజెక్టు వరద ఉద్ధృతికి వంతెనకి రెండు వైపులా గండిపడింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ఇరువైపులా మట్టి పోసి మరమత్తులు చేపట్టారు. వెంకటాపూర్ మండలంలో ఎన్నడూ లేని విధంగా 70 శాతం వర్షం కురవడంతో బూరుగుపేట గ్రామ సమీపంలో ఉన్న మారేడుగొండ చెరువు నాలుగు చోట్ల తెగి భూపాలపల్లి- ములుగు వెళ్లే ఎనిమిది వందల మీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతింది. అధికారులు మట్టి పోసి తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. అక్కడక్కడ లోతుగా ఏర్పడిన వద్ద పైపులు వేసి రహదారి పనులు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details