Road Accident In Nalgonda : ఆగి ఉన్న టాటాఏస్ వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి.. వీడియో వైరల్
Published : Oct 4, 2023, 10:49 AM IST
Road Accident In Nalgonda: నల్గొండ నల్గొండ జిల్లా హాలియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కారు అదుపుతప్పి ఆగి ఉన్న టాటాఏస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
హాలియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అడవిదేవుపల్లి మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన బొమ్మరబోయిన రామారావు, నక్క పెంటయ్య, మకరబోయిన వెంకటేశ్వర్లు, చిన్న దిబయ్య, అంకాల చిన్న ఏడుకొండలు కలిసి కారులో వ్యక్తిగత పనుల నిమిత్తం నాగార్జునసాగర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హాలియా మీదుగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో.. మిర్యాలగూడ రోడ్డు ఆంజనేయ రైస్‌మిల్ వద్ద కారు అదుపుతప్పి టాటాఏస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో రామారావు, నక్క పెంటయ్య అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు నల్గొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.