తెలంగాణ

telangana

Awareness Programme on Use of Vote

ETV Bharat / videos

సామాన్యుడి చేతిలో ఓటే ఆయుధం - ఆ హక్కును వినియోగించే సమయం ఆసన్నమైంది - జాగృతి సంస్థ ఓటు వినియోగంపై అవగాహన

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 1:05 PM IST

Right to Vote Challenge in Telangana : ఓటర్ల ఒత్తిడి వల్లే నాయకులు ప్రలోభాలకు తెరతీస్తున్నారని ప్రముఖ స్వచ్చంద సంస్థ జాగృతి అభ్యుదయ సంఘం అభిప్రాయపడుతోంది. హైదరాబాద్​లోని వనస్థలిపురంలో వివిధ సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ఈ సంస్థ.. ఓటు హక్కు వినియోగంపై వినూత్నంగా ప్రచారం చేస్తోంది. రైట్​ టు ఓట్ ఛాలెంజ్(Right to Vote Challenge) పేరుతో ఆ సంస్థ వ్యవస్థాపకులు భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు.. 35 రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు.

Vote Awareness Programme Jagruthi Organization: జాగృతి సంస్థ గత నెల రోజులుగా ప్రచారం చేస్తూ.. సుమారు 5 వేల మందికిపైగా ఓటర్లను కలిసిన ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు, ఎన్నికల తీరు, నాయకుల ప్రవర్తనపై ఓటర్లలో ఉన్న ఆలోచనలను తెలియజేశారు. ఓటు వేసే విధంలో ఓటర్లు పడుతున్న ఇబ్బందులను తెలిపారు. ఈ ఎన్నికల్లో పోలింగ్​ శాతం గతంలో కంటే మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details