Revanthreddy Speech in Lok Sabha : 'ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాల పుస్తకం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో' - Revanth Reddy criticizes Narendra Modi
Revanthreddy Speech in Lok Sabha :ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాలు ఎక్కువగా ఉన్న పుస్తకం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అని.. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు 10 మంది అగ్రనేతలు ఉన్న.. కమలం పార్టీలో ఇవాళ ఒకేఒక నాయకుడు ఉన్నారని అన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హమీ ఇచ్చిన కేంద్రం.. దానిని విస్మరించిందని దుయ్యబట్టారు. రైతుల ఆదాయంను రెట్టింపు చేస్తామని అన్నారని రేవంత్‌రెడ్డి (Revanthreddy) గుర్తు చేశారు.
నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు.. వేస్తామని చెప్పారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నేరవేర్చలేదని మండిపడ్డారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ సభలోకి వచ్చి.. మణిపూర్లో గిరిజనులపై జరుగుతున్న దాడులపై స్పందించి ఉంటే ఆయన గౌరవం పెరిగేదని అన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం విభజించు పాలించు విధానాన్ని దేశంలో అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. కర్ణాటకలో బీజేపీని తిరస్కరించారని.. ఇదే దేశానికి ఓ దిక్సూచి అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.