Revanth Reddy, Telangana Election Result 2023 LIVE : రేవంత్ రెడ్జి ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకుల సంబురాలు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023
Published : Dec 3, 2023, 1:30 PM IST
Revanth Reddy, Telangana Election Result 2023 LIVE :తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఆధిక్యత చూపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దిశగా ఫలితాలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందం వెల్లువిరిసింది. ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుండటంతో జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. రేవంత్ నివాసం వద్ద టపాసులు కాల్చి కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తున్నారు.
రేవంత్ నివాసానికి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా చేరుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. దాదాపు 62 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్‌లో విజయం సాధించగా.. కామారెడ్డి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ ఇంటికి క్యూ కడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు చేరుకుంటున్నారు. మరోవైపు గాంధీ భవన్ ముందు భారీగా కాంగ్రెస్ నాయకులు చేరి సంబురాలు చేసుకుంటున్నారు.