రేవంత్‌ను సీఎం చేయాలంటూ అభిమానుల ఆత్మహత్య యత్నాలు - ఎల్లా హోటల్ వద్ద రేవంత్ అభిమానుల ఆందోళన
Published : Dec 5, 2023, 3:55 PM IST
|Updated : Dec 5, 2023, 6:59 PM IST
Revanth Reddy Fans Suicide Attempt At Ella Hotel : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడంలో జాప్యం జరుగుతోందంటూ గచ్చిబౌలి ఎల్లా హోటల్ గేటు వద్ద ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. కొంతమంది యువకులు ఆత్మహత్య యత్నాానికి పాల్పడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొంతమంది యువకులు రేవంత్‌రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో ఓ యువకుడు తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరికాసేపటికే మరో వ్యక్తి పెట్రోల్ పోసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
రేవంత్ రెడ్డి సీఎం కాకుండా చాలా కుట్రలు జరుగున్నాయని రేవంత్ అభిమానులు ఆరోపించారు. ఫలితాల వెల్లడి తరువాత నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఎల్లా హోటల్లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా 48 గంటలుగా ఆ హోటల్లో ఉన్నారు. సాయంత్రం డీకే శివకుమార్ హైదరాబాద్ వచ్చిన తరువాత కొత్త సీఎం పేరును ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.