తెలంగాణ

telangana

Revanth Reddy Exclusive Interview

ETV Bharat / videos

తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం - 2050 విజన్‌తో ప్రజల ముందుకు : రేవంత్​రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 11:25 AM IST

Revanth Reddy Exclusive Interview :స్వరాష్ట్ర పోరాట ఆకాంక్షలను కాలరాస్తూ దశాబ్దకాలం పాటు సాగించిన సీఎం కేసీఆర్​ పాలనకు.. కాల పరిమితి ముగిసిపోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తేనే ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఇందుకు ఈ శాసనసభ ఎన్నికల్లో హస్తం పార్టీని తెలంగాణ జనం నిర్ణయించుకున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Revanth Reddy Latest Interview :బీజేపీ తన స్టార్‌ క్యాంపెయినర్లు ఈడీ, సీబీఐ, ఐటీలతో కాంగ్రెస్‌ నేతలపై దాడులు చేయించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తోందని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. భూస్వామ్యులను కాపాడేందుకే కేసీఆర్‌ తెచ్చిన ధరణిని తొలగించి.. టైటిల్‌ గ్యారెంటీతో కూడిన పాస్‌ పుస్తకాన్ని ఇస్తామన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2050 విజన్‌తో ప్రజల ముందుకెళ్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details