తెలంగాణ

telangana

Revanth Reddy Latest Comments on CM KCR

ETV Bharat / videos

రైతుబంధుకు అనుమతి తెచ్చిన సీఎం- దళిత బంధుకు ఎందుకు తేలేదు : రేవంత్ రెడ్డి - బంధ్​కు పిలుపునిచ్చిన రేవంత్

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 7:23 PM IST

Revanth Reddy Election Campaign in Kamareddy : తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్​కు ప్రజలు బుద్ధి చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని జుక్కల్ విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతికి పాల్పడిన సొమ్మును వెలికి తీస్తామని తెలిపారు. 

Revanth Reddy Latest Comments on CM KCR: సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపించడం ఖాయమని రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రైతుబంధు(Rythu Bandhu)కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తెచ్చుకున్నారని.. అన్నదాతలకు రైతుబంధు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ దళిత బంధుకు అనుమతి ఎందుకు తేలేదని ప్రశ్నించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details