తెలంగాణ

telangana

Revanth Reddy Comments on KCR

ETV Bharat / videos

Revanth Reddy Challenge to KCR : 'కర్ణాటకలో అమలు అవుతున్న పథకాలు చూసేందుకు సిద్ధమా?' - రేవంత్‌ రెడ్డి ఛాలెంజ్‌ టు కేసీఆర్‌

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 4:43 PM IST

Revanth Reddy Challenge to KCR : సంగారెడ్డి కాంగ్రెస్‌ విజయభేరి సభలో బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్(KCR) రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. దళితులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని మరిచిపోయారని మండిపడ్డారు. పండిన పంట కొనుగోలు చేసే పరిస్థితిలో రాష్ట్రం లేదని విచారం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ(SoniaGandhi) మళ్లీ ఆదుకుంటే తప్ప తెలంగాణ బాగుపడే పరిస్థితి లేదని అన్నారు. 

Revanth Reddy Comments on KCR Today : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సవాలుతో బీఆర్‌ఎస్‌ నేతలు తోక ముడుచుకున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌(Karnataka Congress) ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని.. నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారని సవాలు విసిరారు. ప్రభుత్వ పథకాలను కేసీఆర్‌ చూస్తానంటే.. బస్సు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇసుక జారడంతో మేడిగడ్డ ప్రాజెక్ట్‌ కుంగిపోవడం చెప్పడం చాలా బాధాకరమని.. నివేదిక ఇచ్చిన వాళ్లను జైలులో పెట్టాలని ధ్వజమెత్తారు. అనంతరం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వనున్న ఆరు గ్యారంటీల గురించి వివరించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే జగ్గారెడ్డి(Jagga Reddy)కి కీలక పదవి ఇస్తామని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details