అయోధ్య రాముడి కోసం షిర్డీలోని వృద్ధుల సంకల్పం - ప్రతి రోజూ 11 గంటల పాటు భజన - Ayodhya Ram Mandir
Published : Jan 14, 2024, 9:01 PM IST
Remembrance of Ayodhya Ram in Old Age Home in Shirdi: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తుండటంతో దేశం మొత్తం రామ నామంతో మార్మోగుతోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అయోధ్య రామమందిర ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. జనవరి 22న అత్యంత ఘనంగా అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అనేక మందిని ఆహ్వానిస్తున్నారు. ఈ చరిత్రాత్మక వేడుకను చూడాలని అనేక మంది భారతీయులు కోరుకుంటున్నారు.
ఇందులో భాగంగా షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు సైతం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. అదే విధంగా రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షద కలశాన్ని శ్రీ సాయి సమాధి ఆలయంలో ఉంచారు. అయితే షిర్డీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమానికి చెందిన వృద్ధులు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరవడం సాధ్యం కావడం లేదు. దీంతో ఈ పవిత్రమైన ఘట్టానికి తమ వంతు ఏమైనా చేయాలని సంకల్పించారు. రాముడి సేవ చేసేందుకు గాను ప్రతి రోజూ 11 గంటల పాటు "శ్రీరామ్ జై రామ్ జై జై రాం" అనే నామస్మరణ చేస్తున్నారు.