తెలంగాణ

telangana

Neeta Ambani

ETV Bharat / videos

హైదరాబాద్​లో రిలయన్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్ - ప్రారంభించిన నీతా అంబానీ - Nita Ambani Hyderabad News

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 12:07 PM IST

Reliance Retail First Swadesh Store In Hyderabad: హైదరాబాద్​లో రిలయన్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్​ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ ప్రారంభించారు. చేతివృత్తులతో పాటు సంప్రదాయ కళాకారులను ప్రోత్సహించేందుకు.. దేశంలోనే తొలి స్వదేశ్ స్టోర్​ను హైదరాబాద్​లో ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. 

First Swadesh Store InJubilee Hills  :జూబ్లీహిల్స్​లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ల్​లో 'స్కాన్ అండ్ నో' సాంకేతికత ద్వారా ప్రతి ఉత్పత్తి, ఆ వస్తువుల తయారీదారు వివరాల్ని తెలుసుకోవచ్చని నీతా అంబానీ వెల్లడించారు. హైదరాబాద్ తమకు ఎంతో ప్రత్యేకమన్న నీతా అంబానీ.. తమ రిలయన్స్ రిటైల్ మొదటి స్టోర్​ని సైతం ఇక్కడే ప్రారంభించిన్నట్లు గుర్తుచేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రామ్ చరణ్, ఉపాసన , మహేశ్​బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, సినీ నటి మంచు లక్ష్మి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పి.వి. సింధూ, సైనా నెహ్వాల్, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details