'రామ..రామ ఇదేం పని'.. శ్రీరామనవమి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్
Recording dance at Srirama navami celebrations in Nalgonda : సాధారణంగా శ్రీరామనవమి సందర్భంగా.. ఆ రోజు రాత్రి భక్తికి సంబంధించిన భజన కార్యక్రమాలో.. నాటక ప్రదర్శనలో ఉంటాయి. కానీ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో మాత్రం అర్ధరాత్రి దాటాక రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. ఇందులో విడ్డూరమేమిటంటే వీటిని అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పోటీ పడి మరీ నిర్వహించారు.
అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నోముల భగత్ వర్గం, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం, కాంగ్రెస్ పార్టీ , మరొక రెండు సామాజిక వర్గాల వారు మొత్తం తిరుమలగిరిలో గుంటూరుకి చెందిన రికార్డింగ్ డాన్స్ బృందాలతో ఆరు చోట్ల ఏర్పాటు చేశారు. డాన్స్ వేడుకల్లో పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ చిందులు వేయించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పోటా పోటీగా రికార్డింగ్ డ్యాన్సు ఏర్పాటు చేయడంతో ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకోనుందోననేది చర్చనీయాంశమైంది.