Prathidwani : హైదరాబాద్.. 'రియల్' బాద్షా
Realestate Growth in Hyderabad : సొంతింటిని కలిగి ఉండటం సగటు మధ్య తరగతి జీవి జీవిత కాల వాంఛ. అటువంటిది రాష్ట్ర రాజధాని భాగ్య నగరంలో సొంతిటిని కలిగి ఉండటమంటే వరంగానే చెప్పొచ్చు. హైదరాబాద్ నేడు గ్లోబల్ సిటీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉపాధి కోసం వచ్చి స్థిరపడుతున్నారు. అన్ని రంగాల్లోనూ నగరం వేగంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరంలో కొలువుదీరాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అంచనాలకు మించిన ఫలితాలతో ఆశ్చర్యపరుస్తోంది. భాగ్య నగరంలో హౌసింగ్ రంగంలో చదరపు అడుగు గరిష్ఠ ధర ఏకంగా 10 వేల 400 దాటింది అన్న క్రెడాయ్ - కొల్లీర్స్ నివేదికే అందుకు తాజా ఉదాహరణ. మరి.. రాజధాని ప్రాంత నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న కారకాలు ఏమిటి? ఈ క్రమంలో ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ రంగం ప్రతినిధులు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమిటి? భాగ్య నగరం నిర్మాణ రంగం భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.