PRATHIDWANI : రాష్ట్రంలో ఏర్పాటైన రెరా.. ప్లాట్లు కొనేవారికి మేలు కలుగుతుందా? - రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ
Real Estate Regulatory Authority Establishment Today Prathidwani : ఎట్టకేలకు.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటైంది. ఛైర్మన్, ఇద్దరు సభ్యులతో పూర్తిస్థాయి అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఉన్నతాధికారి ఎన్.సత్యనారాయణ ఛైర్మన్‌గా ఈ కొత్త అథారిటీ కొలువుదీర్చారు. అయితే ఎప్పుడో 2017లో రెరా చట్టం వచ్చినా వీరి నియామకాల విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది?
ప్రస్తుత నిర్ణయంతో నిర్మాణరంగం, ప్లాట్లు, ఫ్లాట్లు కొనేవారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? వాటిని నెరవేర్చే క్రమంలో రెరా అథారిటీ ఎలాంటి సవాళ్లు అధిగమించాల్సి ఉంటుంది? వినియోగదారుల కోణంలో రెరా ముందు ఉన్న సవాళ్లు ఏంటి? సమాచార, ఫిర్యాదు సేవలు ఎలా ఉండబోతున్నాయి? ఏఏ విషయాల్లో ప్రజలు రెరా సహాయం పొందవచ్చు? అథారిటీని నియమించడంతో పాటు వీరు స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి ఎలాంటి వాతావరణం కావాలి? ఆ విషయంలో రాష్ట్రప్రభుత్వం ముందున్న బాధ్యతలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.