తెలంగాణ

telangana

Prayagraj Ravan Yatra 2023

ETV Bharat / videos

Prayagraj Ravan Yatra 2023 : బ్యాండ్​ బాజాలతో రావణుడికి ఊరేగింపు.. లంకాధిపతికి పూజలతో 'దసరా' షురూ! - రావణుడికి ప్రయాగ్​రాజ్​కు సంబంధం

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 12:47 PM IST

Prayagraj Ravan Yatra 2023 :శ్రీరాముడిని ఆరాధిస్తూ, శోభాయాత్రలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా దసరా వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. దసరా సందర్భంగా రావణుడి ప్రతిమను దహనం చేస్తారు. కానీ, వీటికి భిన్నంగా ఉత్తరప్రదేశ్.. ప్రయాగ్​రాజ్​లో కట్రా రాంలీలా కమిటీ ఆధ్వర్యంలో రావణుడి ఊరేగింపుతో దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. రావణుడి వేషధారణలో ఉన్న వ్యక్తికి పూజలు నిర్వహించి ఈ మేరకు ఊరేగింపు జరిపారు. ముందుగా శివాలయంలో రావణుడికి హారతి ఇచ్చి.. అనంతరం లంకాధిపతితో పాటు అతడి కుటుంబ సభ్యుల వేషధారణలో ఉన్నవారిని రథాల్లో ఊరేగించారు. బ్యాండ్ వాయిద్యాలు, మిరుమిట్లు గొలిపే లైట్లతో నగర వీధుల్లో సందడి వాతావరణం ఏర్పడింది.

ఈ వేడుకలను ప్రతి సంవత్సరం పితృ పక్ష ఏకాదశి రోజున నిర్వహిస్తారు. ఈ యాత్రను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే ఇక్కడ రావణ దహనం నిర్వహించకపోవడానికి కారణాలున్నాయి. రావణుడు భరద్వాజ ముని మనవడు అని ఇక్కడివారు విశ్వసిస్తుంటారు. ఇక్కడి పురాతన కమిటీలలో కట్రా రాంలీల ఒకటి. ఇక్కడున్న భరద్వాజ ముని ఆశ్రమం కట్రా రాంలీల పరిధిలోకి వస్తుంది. దీంతో పాటు ఆయన అపార పాండిత్యం, శివభక్తి కారణంగా ఇక్కడి వారు రావణదహనం చేయరు. 

ABOUT THE AUTHOR

...view details