Rangareddy Avocado Farmer Interview : రూ.లక్షలు వచ్చే ఉద్యోగాలు వదిలి 'అవకాడో పంట' సాగు.. ఇప్పుడు అంతకు మించి..! - రంగారెడ్డి జిల్లాలో అవకాడో పంట
Published : Aug 31, 2023, 4:52 PM IST
Rangareddy Avocado Farmer Interview : వ్యవసాయం అనేది పెద్ద ఉపాధి రంగం. ఉన్నత చదువులు, విదేశాల్లో చక్కటి కార్పొరేట్ కొలువులు, ఆకర్షణీయమైన డాలర్లు, పౌండ్ల వేతనాలు, విలాసవంతమైన జీవితాలు సైతం యువతకు సంతృప్తి ఇవ్వడం లేదు. పుట్టిన ఊరు.. తల్లిదండ్రులు, కుటుంబాలను వదిలేసి ఎంత సంపాదించినా ఏం సుఖం అన్న ఆలోచన మొదలవుతోంది. దీంతో యువత మళ్లీ మన మూలాల్లోకి వచ్చేస్తున్నారు.
Avocado Jaipal Naik Interview : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ తండాకు చెందిన రమావత్ జైపాల్ నాయక్.. హైదరాబాదాద్‌లో బీటెక్ పూర్తి చేసి.. అనంతరం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి ఎంబీఏ పూర్తి చేశాడు. మూడేళ్లు వివిధ ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించినా ఏ సంతృప్తి కలగకపోవడంతో సొంతూరొచ్చి ఆధునిక సేద్యం ఆరంభించాడు. అతి శీతల దేశాల్లోనే పండే అవకాడో పంట(Avocado Crop)లోని ఓ రకాన్ని సాగు చేస్తూ.. అద్భుత లాభాలు పొందుతున్నాడు జైపాల్ నాయక్. ఈ ఏడాది మరో 10 ఎకరాల విస్తీర్ణంలో అవకాడో పంట సాగు చేపట్టబోతున్న దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఔత్సాహిక యువ రైతులు ముందుకు వస్తే తన వంతు సాయం అందిస్తానంటున్న యువ రైతుతో ప్రత్యేక ముఖాముఖి..