రవితేజ- నిర్మాత సుధాకర్ మధ్య గొడవకు కారణం వాళ్లేనట.. మాస్ మహారాజా క్లారిటీ - ravi teja vs producer sudhakar
రవితేజ హీరోగా శరత్ మండవ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. సుధాకర్ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో నిర్మాత సుధాకర్- రవితేజ మధ్య మనస్పర్థల వల్లే సినిమా వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో.. నిర్మాత సుధాకర్‌తో గొడవ జరిగిందా? లేదా? అసలేమైంది? అనే దానిపై రవితేజ చెప్పారు. మీరూ చూసేయండి. 1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దీనికి సామ్ సీఎస్ స్వరాలందిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST