కదలకుండా ఎంతో బుద్ధిగా రాఖీ కట్టించుకున్న చిరుత - Rajasthan Hindi news
రాజస్థాన్ రాజ్‌సమంద్ జిల్లాలో ఓ మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. రోడ్డుపై వెళ్తున్న వణ్యప్రాణికి రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ చిరుతకు గాయాలు అయ్యాయి. అందువల్ల అది మెల్లిగా రహదారి పక్కన నడుస్తూ వెళ్తోంది. దీంతో చిరుత గురించి అటవీ అధికారులకు నరానా గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి చిరుతను జాగ్రత్తగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే చిరుత కోలుకోవాలని ప్రార్థిస్తూ ఓ మహిళ రాఖీ కట్టింది. మనుషులను భయపెట్టకుండా, తాను భయపడకుండా చిరుత రాఖీ కట్టించుకోవడం విశేషం.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST