Rakhi Celebrations at Shirdi Saibaba Temple: శిరిడీ సాయి ఆలయంలో రాఖీ వేడుకలు.. బాబాకు రాఖీ కట్టిన అర్చకులు - rakhi celebrations in shirdi saibaba temple
Published : Aug 30, 2023, 5:52 PM IST
Rakhi Celebrations at Shirdi Saibaba Temple Under Auspices of Sai Sansthan: అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య బంధాన్ని బలపరిచేది రక్షాబంధన్. ఈ పండగను శిరిడీ సాయిబాబా ఆలయంలో సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ క్రతువును భక్తులు వీక్షించి పరవశించిపోయారు. మహిళ భక్తులు.. సాయిబాబాను పోషకుడిగా భావిస్తారు.
ఈ రోజు శిరిడీలో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమం మొదట కాకడ్ హారతితో ప్రారంభమైంది. ఆ తర్వాత బాబాకు మంగళస్నానం చేయించారు. అనంతరం ప్రత్యేకంగా వెదురు, పాలరాతి ముత్యాలతో రూపొందించిన రాఖీని.. సాయి మందిరం అర్చకులు బాబా చేతికి కట్టారు. రాఖీ కట్టిన అనంతరం అర్చకులు సాయిబాబా విగ్రహనికి మధ్యాహ్న హారతి నిర్వహించారు. భక్తులు వహత్ రహో అంటూ సాయిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. సాయి బాబా జీవించి ఉన్న కాలంలో రక్షా బంధన్ రోజున శిరిడీలో మహిళలు బాబాకు రాఖీ కట్టేవారని.. పురాణాలు వివరిస్తున్నాయని అర్చకులు వివరించారు. ఈ సంప్రదాయాన్ని నేటికి సాయి సంస్థాన్తో పాటు భక్తులు కూడా కొనసాగిస్తున్నారు.