యువతా మేలుకో - ఓటువేసి నీ తలరాత నువ్వే రాసుకో : రజత్ కుమార్ - telangana assembly elections
Published : Nov 28, 2023, 1:33 PM IST
Rajat Kumar Interview On Vote Awareness : ఓటు ... సామాన్యుడి చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం. ప్రజాస్వామ్యంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలకోసం, ప్రజా ప్రయోజనం కోసం పనిచేసే నేతలను అందలం ఎక్కించి అభివృద్ధికి నాంది పలికేందుకు ఓటే ఆయుధం. అయితే పల్లెలతో పోలిస్తే.. నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని ఐఏఎస్ అధికారి, గతంలో రాష్ట్ర ఎన్నికల నిర్వాహణ అధికారిగా పనిచేసిన రజత్‌కుమార్ అంటున్నారు. ఇక్కడ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులపై తక్కువగా ఆధారపడతారని అందుకే ఎక్కువ మంది ఓటు వేయడానికి ఇష్టపడరని తెలిపారు. పట్టణాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారని.. ఇలాంటి కారణాలతో పట్టణాల్లో పోలింగ్ పట్ల కొన్ని సవాళ్లున్నాయన్నారు.
ఏ కారణమైనా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవటం ఎంతో ముఖ్యమని.. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాంటి ఓటును వినియోగించుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో పోలింగ్‌కి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలు పోలింగ్ శాతం పెరిగేందుకు ఏ విధంగా ఉపయోగపడతాయి. 100 శాతం పోలింగ్ సాధించాలంటే ఏం చేయాలి? తొలిసారి ఓటు వేసే వారు ఏం ఆలోచించాలనే అంశాలపై గతంలో రాష్ట్ర ఎన్నికల నిర్వాహణ అధికారిగా పనిచేసిన రజత్‌కుమార్ ఈటీవీతో పంచుకున్నారు.