తెలంగాణ

telangana

ASI Rescued Man from Train Accident

ETV Bharat / videos

ASI Rescued Man from Train Accident: రైల్వే ఏఎస్ఐ చాకచక్యం ప్రయాణికుడికి తృటిలో తప్పిన ప్రమాదం - ప్రమాదం చిత్రాలు

By

Published : Jul 5, 2023, 5:49 PM IST

Train Accident in prakasam: రైలు ఎక్కుతూ జారిపడి చిన్నపాటి గాయాలతో ఓ ప్రయాణికుడు ప్రమాదం నుండి బయటపడ్డ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన తీరు ఒంగోలు రైల్వేస్టేషన్​లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రైల్వే అధికారులు  తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు ఒంగోలు రైల్వేస్టేషన్​లో ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారంపై వచ్చి ఆగింది. కొంతసేపటి తరువాత ఆ రైలు ముందుకు కదిలింది.. ఈలోగా ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో జారి పడ్డాడు. ఫ్లాట్ ఫాం.. రైలు బోగికి మధ్యలో పడి కొద్ది దూరం రైలు లాక్కెళ్లుతుండగా.. అక్కడే మఫ్టీలో ఉన్న రైల్వే ఏఎస్ఐ శ్రీనివాసరావు చాకచక్యంగా వ్యవహరించాడు. వెంటనే పట్టాల మధ్య పడబోతున్న ప్రయాణికుడిని బయటకు లాగి రక్షించాడు. ఆ ప్రయాణికుడు కొద్దిపాటి గాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు.  తిరిగి అదే రైలులో వెళ్లిపోయాడు. తన చాకచక్యంతో ప్రయాణికుడిని రక్షించిన ఏఎస్ఐ శ్రీనివాసరావును ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు.  

ABOUT THE AUTHOR

...view details