తెలంగాణ

telangana

Railway Constable Who Saved A Person Life in Ramagundam

ETV Bharat / videos

Railway Constable Saved A Person in Ramagundam Viral Video : పట్టాలు దాటుతుండగా సడెన్​గా ట్రైన్.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చాకచక్యంతో సేఫ్​ - Ramagundam news features

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2023, 5:15 PM IST

Railway Constable Saved A Person in Ramagundam Viral Video : రైలును గమనించకుండా పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తి ప్రాణాలు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడిన ఘటన రామగుండం రైల్వేస్టేషన్​లో జరిగింది. ఓ ప్రయాణికుడు రామగుండం రైల్వేస్టేషన్​లోని రెండో ప్లాట్​ఫామ్ నుంచి మొదటి ప్లాట్​ఫామ్​కు వచ్చే క్రమంలో పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో ఆ వైపుగా వస్తున్న రైలును అతను గమనించలేదు. అది చూసిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దినేశ్.. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. చాకచక్యంగా వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడినందుకు కానిస్టేబుల్ దినేశ్​ను రైల్వే ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించారు. సదరు వ్యక్తిని కానిస్టేబుల్ దినేశ్ కాపాడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ప్రయాణికులు రైలు ప్రయాణం చేసేటపుడు, ర్వేల్వేస్టేషన్​లలో పట్టాలు దాటుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. లేనట్లయితే ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రయాణికులు రైల్వే అధికారుల సూచనలు పాటించాలన్నారు. రైలు పట్టాలు దాటడం వంటివి చేయకపోవడం మంచిదని చెప్పారు. ప్రయాణికులు ఇలాంటివి చేయొద్దని తరచూ హెచ్చరిస్తున్నా.. వినకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 

ABOUT THE AUTHOR

...view details