తెలంగాణ

telangana

ETV Bharat / videos

మానవత్వం చాటుకున్న రాహుల్.. రోడ్డుప్రమాద బాధితుడికి సాయం - రోడ్డు ప్రమాదం రాహుల్ గాంధీ

By

Published : Jul 3, 2022, 9:59 AM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మానవత్వాన్ని చాటుకున్నారు. సొంత నియోజకవర్గం వయనాడ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ బాధితుడికి అంబులెన్స్‌ సమకూర్చి ఆసుపత్రిలో చేర్చేలా సాయం చేశారు. శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హోటల్‌కు బయలుదేరిన రాహుల్‌ గాంధీ... ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురవడాన్ని గమనించారు. వెంటనే తన వాహనం నుంచి దిగిన రాహుల్‌.. స్థానికులతో కలిసి ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించడంలో సాయం చేశారు. అనంతరం అంబులెన్స్‌ను రప్పించి ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details