నిరుద్యోగుల బాధను తగ్గించడంలో మా ఉద్యోగ క్యాలెండర్ తొలి అడుగు: రాహుల్ గాంధీ
Published : Nov 27, 2023, 7:44 PM IST
Rahul Gandhi Tweet on Unemployment in Telangana : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 'దొరల' కేసీఆర్(KCR) సర్కార్ కింద తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను హైదరాబాద్ అశోక్‌నగర్‌లో సెంట్రల్ లైబ్రేరీలో నిరుద్యోగులను కలిశారని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య(Unemployment Issue) గురించి విపులంగా తెలుసుకున్నారని తన ఎక్స్(ట్వీటర్) వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
Rahul Gandhi Visit Central Library in Hyderabad : నిరుద్యోగ యువత బాధను తగ్గించేందుకు తమ కాంగ్రెస్ ‘ఉద్యోగ క్యాలెండర్’తో తొలి అడుగు ముందుకు వేసిందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఇచ్చారు. యూపీఎస్సీ మాదిరి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. యువ వికాసం కింద విద్యార్ధులకు రూ.5 లక్షల సహాయం.. యువత భవిష్యత్తు కాంగ్రెస్ ప్రజా సర్కార్ చేతిలో భద్రంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు తమదే గ్యారెంటీ! అని స్పష్టం చేశారు.