తెలంగాణ

telangana

రాహుల్‌ను పెళ్లి చేసుకోమని చెప్పిన లాలూ యాదవ్

ETV Bharat / videos

'త్వరగా పెళ్లి చేసుకో.. ఎక్కువ టైమ్​ లేదు!'.. లాలూ సూచన.. ఓకే చెప్పిన రాహుల్! - లాలూ ప్రసాద్ యాదవ్

By

Published : Jun 23, 2023, 6:57 PM IST

Rahul Gandhi Lalu Yadav : దేశ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పగలదని భావిస్తున్న విపక్ష పార్టీల సమావేశంలో నవ్వులు పూయించారు ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. పట్నాలోని నీతీశ్​ కుమార్ నివాసంలో భేటీ అనంతరం విపక్ష నేతలు కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్​లో తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. బీజేపీపై పోరులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(53) ఎంతో బాగా పనిచేస్తున్నారని ప్రశంసించిన లాలూ.. అనూహ్యంగా పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు.

"రాహుల్ గాంధీ వచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన చాలా బాగా పనిచేశారు. భారత దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అదానీ వ్యవహారంలో లోక్​సభలో పోరాడారు. మీరు(రాహుల్ గాంధీ) పెళ్లి చేసుకుని తీరాలి. ఇంకా ఎక్కువ సమయం లేదు. పెళ్లి చేసుకోండి.. మమ్మల్ని బరాత్​కు తీసుకెళ్లండి. వివాహం విషయంలో మాట వినడం లేదని మీ తల్లి(సోనియా గాంధీ) ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి" అని కాంగ్రెస్ అగ్రనేతకు సూచించారు లాలూ ప్రసాద్ యాదవ్.

ఆర్​జేడీ అధినేత పెళ్లి గురించి మాట్లాడుతుండగా.. చుట్టూ ఉన్న నేతల నవ్వులతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. లాలూ సూచనపై నవ్వుతూ స్పందించిన రాహుల్ గాంధీ.. "మీరు అడిగారు కాబట్టి అయిపోయినట్టే" అని జవాబు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details