ఇల్లు మారిన రాహుల్.. సోనియా ఇంటికి సామాన్లు.. 20 ఏళ్ల తీపి గుర్తులు కూడా! - రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దిల్లీలోని తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ఇంట్లోని వస్తువులను రెండు లారీల్లో టెన్ జన్‌పథ్‌లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి తరలించారు. రాహుల్ గాంధీ ఇప్పటికే కొన్ని ఇళ్లను చూశారని అయితే ఆయన తన తల్లి నివాసంలోనే కొన్నాళ్లు పాటు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష పడటం వల్ల ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఈ నెల 22 కల్లా అధికారిక భవనాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభకు చెందిన హౌసింగ్ కమిటీ లేఖ రాహుల్ గాంధీకి లేఖ రాసింది.
అయితే దిల్లీ తుగ్లక్ లేన్‌లోని 12వ నంబర్ బంగ్లా ఖాళీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవలే.. రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు. "నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాను. ఇది ప్రజల ఆదేశం. సుమారు 20 ఏళ్లు.. ఇక్కడ గడిపిన సంతోషకరమైన జ్ఞాపకాలకు జీవితంలో మరచిపోలేను. నా హక్కులకు భంగం కలగకుండా, మీ లేఖలో ఉన్న వివరాలకు నేను కట్టుబడి ఉంటాను" అని లోక్‌సభ సెక్రటేరియట్ అధికారులకు లేఖ రాశారు. దీంతోపాటుగా లోక్‌సభ సచివాలయ అధికారులు పంపిన లేఖ అందిందని.. అది పంపినందుకు సంతోషం అని ఆ లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. 2020లో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ భద్రతలో ఎస్పీజీ సిబ్బందిని తొలగించడం వల్ల లోథీ ఎస్టేట్‌లో తనకు కేటాయించిన భవననాన్ని ఆమె ఖాళీ చేశారు.