Rahul Gandhi Cooks Dosa in Bus Yatra : బస్సుయాత్రలో గరిట పట్టిన రాహుల్.. సరదాగా దోసెలు వేస్తూ.. - Rahul Gandhi bus yatra in Jagtial
Published : Oct 20, 2023, 12:16 PM IST
Rahul Gandhi Cooks Dosa in Bus Yatra Jagtial : రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. జగిత్యాల జిల్లా నూకపల్లిలో గరిట పట్టారు. టిఫిన్ సెంటర్‌లో దోసెలు వేస్తూ.. సందడి చేశారు. విజయభేరీ బస్సు యాత్రలో భాగంగా చివరి రోజు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌లో పర్యటిస్తున్న రాహుల్.. ఉదయం జగిత్యాలకు బయలుదేరారు. మార్గమధ్యలో నూకపల్లి బస్టాండు వద్ద వాహనం ఆపిన ఆయన.. రోడ్డు పక్కనున్న ప్రయాణికులను కలిశారు.
Rahul Gandhi Makes Dosa in Jagtial Bus Yatra : ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారితో ముచ్చటించి.. చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ, అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేశారు రాహుల్. బస్టాండు వద్దనున్న టిఫిన్ బండి వద్దకు వెళ్లిన రాహుల్‌గాంధీ.. స్వయంగా గరిటపట్టాడు. టిఫిన్ బండి వద్ద స్వయంగా దోసెలు వేశారు. టిఫిన్ బండి నిర్వాహకుడితో మాట్లాడిన రాహుల్.. వారి ఆదాయం, ఖర్చుల గురించి తెలుసుకున్నారు. ఊహించని విధంగా కాంగ్రెస్ అగ్రనేత తమ మధ్య ప్రత్యక్షమవటంతో స్థానికులు ఉబ్బితబ్బిబయ్యారు.