కాలేజీలో ర్యాగింగ్.. జూనియర్లను నిల్చోబెట్టి.. సీనియర్లు వరుసగా.. - madhya pradesh ragging news
మధ్యప్రదేశ్ రత్లాంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశమైంది. జూనియర్ విద్యార్థులను కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ చేయడం కెమెరాకు చిక్కింది. జూనియర్లను వరుసగా నిల్చోబెట్టి.. చెంపలను వాయించారు సీనియర్లు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న వార్డెన్ డాక్టర్ అనురాగ్ జైన్పైకి లిక్కర్ బాటిళ్లను విసిరేశారు. ఆయన త్రుటిలో వాటి నుంచి తప్పించుకున్నారు.ఓ విద్యార్థి ఎవరికీ తెలియకుండా ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. దీనిపై కళాశాల క్రమశిక్షణా కమిటీకి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దిల్లీలోనూ ఈ ఘటనపై కేసు నమోదైంది. ర్యాగింగ్ చేసిన విద్యార్థులను గుర్తించినట్లు సమాచారం. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కళాశాల వర్గాలు స్పష్టం చేశాయి.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST