తెలంగాణ

telangana

Road Accident

ETV Bharat / videos

Quthbullapur Road Accident Viral Video : మద్యం మత్తులో టాటా ఏస్ డ్రైవర్​​ బీభత్సం.. ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు - రోడ్డు ప్రమాద వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 10:59 AM IST

Quthbullapur Road Accident Viral Video :హైదరాబాద్‌లో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు(Road Accidents) తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఆకతాయిలు బైకులు, కార్లపై విన్యాసాలు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మరికొందరు మద్యం సేవించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారి ఆట కట్టించడానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాల దృష్ట్యా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్‌ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చినా ప్రమాదాలకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. 

తాజాగా నగర శివారులోని కుత్బుల్లాపూర్‌లో టాటా ఏస్ వాహనం బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో వాహనాన్ని నడుపుతూ రోడ్డు పక్కన నుంచి వెళ్తున్న పాదచారులతో పాటు మరో రెండు వాహనాలను ఢీ కొట్టాడు. దీంతో వాహనం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంతోషి(35) అనే మహిళ మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 

ABOUT THE AUTHOR

...view details