స్కూటీలోకి దూరిన కొండచిలువ బయటకు తీసేందుకు వాహన భాగాలను విడగొట్టి - ఎమ్సీబి జిల్లాలో భారీ కొండ చిలువ
కొండచిలువ ఓ స్కూటీలోకి దూరి తీవ్ర కలకలం సృష్టించింది. ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్ భరత్‌పుర్ చిర్మిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. రెస్క్యూ బృందం చాలా సమయం శ్రమించి స్కూటీ భాగాలను విడదీసి కొండచిలువను బయటకు తీసింది. దానిని కారులో తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. మనేంద్రగఢ్ అటవీ ప్రాంతం కావడం వల్ల చిరుతపులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు, కొండచిలువలు నివాస ప్రాంతాలకు వస్తున్నాయి. కొన్నిసార్లు వణ్యప్రాణులు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST