తెలంగాణ

telangana

ETV Bharat / videos

Pv Sindhu Golden Temple : ఫస్ట్​టైమ్​ గోల్డెన్​ టెంపుల్​కు పీవీ సింధు.. అందరూ రోజూ ఆపని చేయాలని సూచన! - పీవీ సింధు స్వర్ణ దేవాలయం సందర్శన

🎬 Watch Now: Feature Video

PV Sindhu To Golden Temple

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 8:15 PM IST

Pv Sindhu Golden Temple :భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పంజాబ్​.. అమృత్​సర్​లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. తొలిసారి దేవాలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే మొదటిసారి గోల్డెన్ టెంపుల్​ను దర్శించడం తనకెంతో ఆనందంగా ఉందని సింధు సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న సచ్‌ఖండ్ శ్రీ దర్బార్ సాహిబ్‌ను దర్శించుకున్న తర్వాత తన మనసుకు చాలా ప్రశాంతత లభించిందని ఆమె చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సింధు.. అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. త్వరలోనే మళ్లీ ఈ పుణ్యస్థలికి వచ్చేలా తనని ఆశీర్వదించమని ఆ దేవుడిని కోరుకున్నట్లుగా సింధు తెలిపారు. ఈ సందర్భంగా సింధును గోల్డెన్​ టెంపుల్​ కమిటీ సభ్యులు సన్మానించారు. త్వరలోనే ఒలింపిక్స్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాక్టీస్​ను మొదలు పెట్టనున్నట్లు ఆమె తెలిపారు. చివరగా.. ఆరోగ్యంగా ఉండేందుకు అందరూ ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సింధు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details