తెలంగాణ

telangana

Puvvada Ajay Speaks About TS Election

ETV Bharat / videos

'గత 75 ఏళ్లుగా జరగలేని అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏళ్లలో చేసి చూపించాం' - తెలంగాణ ఎలక్షన్​పై పువ్వాడ అజయ్​

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 4:01 PM IST

Puvvada Ajay Speaks About TS Elections : గత ప్రభుత్వాలు ఖమ్మం హెడ్ ​క్వార్టర్​ని ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ ప్రశ్నించారు. ఖమ్మం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వస్తున్న అపూర్వ స్పందనను చూశాక ప్రజల్లో బీఆర్​ఎస్ పట్ల ప్రేమ కొంచెం కూడా తగ్గలేదని మంత్రి అన్నారు. ఖమ్మంలో ఇక్కడ పాలించిన ప్రభుత్వాలు ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మించలేదని మండిపడ్డారు. అసలు వాటి గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదని విమర్శించారు. 

జిల్లాలో ఇంత వరకు జరిగిన పాలేరు, సత్తుపల్లి, ఇల్లందు సభలకు ప్రజలు భారీగా తరలివచ్చారన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల నమ్మకం సడలలేదన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 5న నిర్వహించే సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు అందరూ రావాలని కోరారు. అనంతరం ఖమ్మం ఎస్‌ఆర్‌ఎండ్‌ బీజీఎన్‌ఆర్‌ మైదానంలో సభ ఏర్పాట్లు పరిశీలించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సభ ఏర్పాట్లపై చర్చించారు. 

ABOUT THE AUTHOR

...view details