తెలంగాణ

telangana

ETV Bharat / videos

120 గంటలపాటు తబలా వాయించి ప్రపంచ రికార్డు.. గిన్నిస్​ బుక్​లో చోటు కోసం..

By

Published : Jan 24, 2023, 6:02 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

120 గంటలపాటు నిర్విరామంగా తబలా వాయించి అరుదైన ఘనతను సాధించాడు పంజాబ్​లోని ఓ యువకుడు. బటాలా నగరానికి చెందిన అమృత్​ప్రీత్​ సింగ్ ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్​లో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు 110 గంటలుగా ఉండేది. వరుసగా ఐదు రోజులు తబలా వాయించడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పాడు. గతేడాది డిసెంబర్​ 31న ఉదయం 11 గంటలకు తమ మత గురువు గురు సాహిబ్ జీ​ కోసం ప్రార్థిస్తూ తబలా వాయించటం ప్రారంభించాడు అమృత్ ప్రీత్ సింగ్​. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు దీన్ని ముగించాడు. ప్రస్తుతం అమృత్ ప్రీత్ సింగ్​ గురునానక్​ కళాశాలలో ఫార్మసీలో డిగ్రీ చేస్తున్నాడు. దీంతో పాటు అతడు గుర్బానీ (సిక్కుల పవిత్ర వచనాలు)లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తాను 9 సంవత్సరాల వయస్సు నుంచే తబలా వాయించడం నేర్చుకున్నానని అమృత్​ప్రీత్​ సింగ్​ చెప్పాడు. ప్రస్తుతం లిమ్కా, గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతేగాక 17 సంవత్సరాల వయస్సు నుంచే అమృత్‌ప్రీత్ సింగ్ అనేక గురుద్వారాలలో తబలా వాయిస్తూ సేవ చేస్తున్నాడు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details