మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళపై దుండగుడు కత్తితో దాడి గోల్డ్ చైన్‌ను లాక్కెళ్లేందుకు యత్నించి - ఒంటరిగా వెళ్తున్న మహిళపై దొంగ దాడి వీడియో
పంజాబ్‌లోని లుథియానాలో మార్నింగ్ వాక్కు బయటకు వెళ్లిన మహిళపై ఓ దొంగ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ రోడ్డుపై పడిపోయింది. వెంటనే ఆమె మెడలోని బంగారపు గొలుసు, తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కెళ్లేందుకు యత్నించాడు. అదే సమయంలో మహిళ కూడా ప్రతిఘటించడం వల్ల ఆమెకు చేతికి గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న సీసీటీవీలో మొత్తం ఘటనాదృశ్యాలు రికార్డు అయ్యాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST