తెలంగాణ

telangana

కర్నాటకలో వర్షం కోసం సమాధులకు పూజలు

ETV Bharat / videos

సమాధులు తవ్వి, మృతదేహాలపైకి నీళ్లు పంపింగ్.. కారణం ఇదేనట! - వర్షాల కోసం స్మశానంలో పూజలు

By

Published : Jun 26, 2023, 3:34 PM IST

వర్షాల కోసం వింత ఆచారాన్ని పాటిస్తున్నారు కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు. సమాధులు తవ్వి, మృతదేహాలపైకి నీళ్లు పంపింగ్ చేస్తున్నారు. శవాలపై నీళ్లు పోసి వాటిని శాంతింపజేస్తున్నామని చెబుతున్నారు. ఇలా చేస్తే పదిరోజుల్లోపే వర్షాలొస్తాయని.. వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయపుర జిల్లాలోని తాలికోట్ తాలూకాలో ఉన్న కలకేరి గ్రామ ప్రజలు ఈ వింత ఆచారం పాటిస్తున్నారు. ముందుగా నీళ్ల ట్యాంకర్​ తీసుకుని ఊరి స్మశానానికి వెళ్లిన గ్రామస్థులు.. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత సమాధులు తవ్వి, మృతదేహాలపైకి నీళ్లు పంపింగ్ చేశారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని పార్థనలు నిర్వహించారు.

వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ తమ గ్రామంలో ఇంకా వర్షాలు పడట్లేదని గ్రామస్థులు తెలిపారు. అందుకే స్మశానంలో పూజలు చేసిన్నట్లు వారు వెల్లడించారు. గత సంవత్సరం కూడా గ్రామంలో వర్షాలు కురవకపోతే ఈ తరహాలోనే పూజలు చేశామని వివరించారు. అనంతరం పది రోజుల్లోపే వర్షాలు కురిశాయని వారు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా వర్షాలు కురుస్తాయని.. తామంతా వ్యవసాయ పనులు మొదలు పెడతామని గ్రామస్థులు ఆశిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు వారు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details