తెలంగాణ

telangana

రెజ్లర్ల ఆందోళనలపై పీటీ ఉష రియాక్షన్​.. నిన్న అలా నేడు ఇలా

ETV Bharat / videos

రెజ్లర్లను కలిసిన పీటీ ఉష​.. నిరసనపై నిన్న అలా నేడు ఇలా

By

Published : May 3, 2023, 2:08 PM IST

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ‌్‌ను తొలగించాలంటూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష కలిశారు. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న సాక్షీమాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, బజ్రంగ్‌ పునియాలతో పీటీ ఉష మాట్లాడారు. అయితే ఏం సంభాషించారని మాత్రం తెలియరాలేదు.  అయితే ఆమె వెళ్లిపోయాక.. దీనిపై రెజ్లర్​ బజరంగ్ పునియా మాట్లాడారు. "పీటీఉష మాకు మద్దతుగా ఉంటానని మాట ఇచ్చారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి.. మాకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. బ్రిజ్​ భూషణ్​ను జైలుకు పంపించే వరకు ఇక్కడే నిరసన కొనసాగిస్తం" అని పేర్కొన్నారు.   

కాగా, రెజ్లర్ల ఆందోళనలపై ఇటీవలే(ఏప్రిల్‌ 27న) తొలిసారి స్పందించిన పీటీ ఉష.. రోడెక్కడాన్ని తప్పుబట్టారు. వీధుల్లో పోరాడటం కాకుండా ఒలింపిక్‌ సంఘానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటే బాగుండని అభిప్రాయపడ్డారు. అయితే పీటీ ఉష వ్యాఖ్యలను రెజ్లర్లు వ్యతిరేకించారు. మహిళ అయి ఉండి కూడా... సాటి మహిళలపై లైంగిక ఆరోపణలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి పీటీ ఉషానే చూసి ఈ స్థాయికి చేరుకున్నామనీ ఇప్పుడు ఆమెనే ఇలా మాట్లాడటం కలచి వేసిందన్నారు. IOA వద్దకు తాము మూడు నెలల ముందే వెళ్లినా... తమకు న్యాయం జరగలేదనీ.. అందుకే వీధుల్లో నిరసిస్తున్నామని బజ్రంగ్‌పునియా అన్నారు. 

ఇదీ చూడండి:లఖ్​నవూ కెప్టెన్​గా కృనాల్​.. బీసీసీఐ ​పర్యవేక్షణలో కేఎల్ రాహుల్​!

ABOUT THE AUTHOR

...view details