Protests in Telangana Against Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు.. రోడ్లపై నిరనసలు - చంద్రబాబు అరెస్ట్ తాజా వార్తలు
Published : Sep 11, 2023, 5:59 PM IST
Protests Across Telangana Against On Chandrababu Arrest :తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణలోనూ టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అయితే బాబు అరెస్ట్(Chandrababu Arrest) అక్రమం అంటూ పలు పార్టీలు ఇప్పటికే ఖండించాయి. కేవలం కక్షపురితంగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించాయి. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా.. పలుపార్టీలు సైతం రాష్ట్రబంద్ పిలుపుకు మద్దతు తెలిపాయి. అలాగే తెలంగాణలో కూడా టీడీపీ నాయకులు నిరసనలు చేశారు.
TDP Leaders Protest Against Chandrababu Arrest in Telangana : బాబు అరెస్టుకు నిరసనగా ఖమ్మం జిల్లా కొనిజర్లలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ ఖమ్మం-వైరా జాతీయ రహదారిపై దర్నా చేశారు. సుదీర్ఘకాలం రాజకీయవేత్తగా ముఖ్యమంత్రిగా పనిచేసి మచ్చలేని నాయకుడుగా ఉన్న చంద్రబాబుపై కక్ష సాధింపు చర్య చేపడుతున్నారని నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చర్యలను మేధావులు ఖండించాలని.. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగులో బాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. జగన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలతో అక్రమ అరెస్టుపై నిరసన(Protest With Black Badges) తెలిపారు. ఏపీలో రాజ్యాంగాన్ని అమలు చేయాలని డీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో నాయకులు పలు ఆందోళన కార్యాక్రమం చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు(TDP Chief Chandrababu Naidu Arrest)కు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టు చేసిన తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు జనసేన పార్టీ నాయకులు సైతం మద్దతు తెలిపారు.