తెలంగాణ

telangana

Protest of 1969 Telangana Activists at Gunpark

ETV Bharat / videos

అమరుల మేనిఫెస్టో తమకు వర్తింపజేయాలని- 1969 ఉద్యమకారుల విజ్ఞప్తి - హైదరాబాద్​లో తెలంగాణ తొలిదశ ఉద్యమకారుల నిరసన

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 5:07 PM IST

Protest of 1969 Telangana Activists at Gunpark : తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమరుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గన్​పార్క్​లోని అమర వీరుల స్థూపం ముందు పెద్ద ఎత్తున తరలివచ్చిన 1969 తెలంగాణ ఉద్యమకారులు నిరసన చేపట్టారు. 

1969 Telangana Protesters Dharna : తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించామని కానీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పట్టించుకోలేదని సంఘం అధ్యక్షుడు రామరాజు వాపోయారు. తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అమరుల కుటుంబానికి 250 గజాల స్థలం, 25 వేల పెన్షన్,  25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, హెల్త్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details